Korutla Polytechnic College | కోరుట్ల, సెప్టెంబర్ 8: కోరుట్ల పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల వృద్ధాశ్రమం సమీపంలో సోమవారం పొలం గట్టుపై వెళుతున్న రైతులు భారీ సైజు పామును గుర్తించారు. ఈ మేరకు ఆ పామును రక్తపింజరుగా గుర్తించిన రైతులు చాకచక్యంగా చంపేశారు.
వర్షాకాలంలో పాములు తరచూ చూస్తుంటామని రైతులు చెబుతుండగా, ఇంత భారీ పరిమాణంలో ఉన్న రక్తపింజర కనిపించడంతో రైతులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. అత్యంత విషపూరితమైనా రక్తపింజర పొలం గట్లపై ఉన్న కప్పలు, ఎలుకలు, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.