Jagityal | జగిత్యాల రూరల్, జూన్ 27 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాల ప్రారంభమై నేటికీ 60 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ కాశి గాని నారాయణరావు 1965 సంవత్సరంలో రైతుల నుండి 32 ఇఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి కళాశాలకు దానంగా ఇచ్చాడు.
అప్పటి నుండి ఈ కళాశాల ఎంతోమంది గొప్ప నాయకులు, ఉన్నతాధికారులు, మేధావులను తయారుచేసిన ఘన చరిత్ర ఈ కళాశాలకు ఉంది. ఈ కళాశాల 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.