Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 13 : చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తూ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలాన్ని పూర్తి స్థాయిలో అధికారులు శనివారం సర్వే నిర్వహించారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ సుమారు రూ.30 కోట్లతో ఆధునీకరిస్తూ అదునాతన విద్యా పరికరాలు, అదనపు తరగతి గదులు, స్విమ్మింగ్ పూల్, క్రీడా సామాగ్రి, ప్రత్యేక అధ్యాపకులతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ సర్వే పరిశీలనలో సర్పంచ్ ఆకవరం భవాని, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్, బుర్ర శ్రీనివాస్, బెజ్జంకి అంజయ్య, పాఠశాల పీడీ సమ్మయ్య, సర్వేయర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.