Singareni | గోదావరిఖని : వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి అధికారుల నివాసం బంగ్లోస్ ఏరియా l లో ఉన్న శ్రీ దుర్గదేవి అమ్మవారి ఆలయం నందు లక్ష మల్లెల పుష్పార్చ న కార్యక్రమాన్ని అనిత లలిత్ కుమార్ ఆర్జీ-1 సేవా సమితి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ సతీమణి మాలతి, డైరెక్టర్ పిపి సూర్యనారాయణ, సతీమణి విజయ వెంకటేశ్వర్లు, ఆర్జీ, 1,2, 3 అడ్రియాల జనరల్ మేనేజర్ల సతీమణులు ఆలయ కమిటీ సభ్యులు లేడిస్ క్లబ్ సభ్యులు లక్ష మల్లెల పుష్పర్చన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ ఆవరణలో లక్ష్మి అష్టోత్తర సహస్ర నామ పూజలు, లలిత సహస్ర నామ పారాయణం చేశారు. ఈ సందర్భముగా జిఎం సతీమణి అనిత లలిత్ కుమార్ మాట్లడుతూ ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చు పౌర్ణమికి గొప్ప విశిష్ఠత కలదని అమ్మవారిని పూలతో పూజించడం వల్ల ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యములు కలుగుతాయని ప్రకృతి వైపరిత్యాలు తొలగిపోయి అందరు సుఖ సంతోషాలతో విలసీల్లుతారని, ప్రకృతి సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఆవరణలో భక్తులు తీర్థ ప్రసాదములు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల అధికారుల సతీమణులు ఉమా, సుధా, లలిత, సునీత, అలివేణి, కృష్ణ, సోనాలి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.