BRS : మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ సమక్షంలో శుక్రవారం రాత్రి సింగరేణి సంస్థ మాజీ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కల్వల నారాయణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.