కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 29 : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో కరీంనగర్‌లోని సిద్దార్థ విద్యాసంస్థల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని, జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచారని విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని భగత్‌నగర్‌లోని సిద్దార్థ హైస్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యాసంస్థలకు చెందిన 452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వంద శాతం ఉత్తీర్ణత సాధించారని, అందులో కే విశ్వక్సేన్ 592 మారులతో జిల్లా టాపర్‌గా నిలిచాడన్నారు.
31 మంది విద్యార్థులు 570కుపైగా మార్కులు, 74 మంది విద్యార్థులు 560కుపైగా, 122 మంది విద్యార్థులు 550కుపైగా మారులు సాధించి సిద్దార్థ విద్యాసంస్థల కీర్తి పతాకాన్ని ఎగురవేశారని సంతోషం వ్యక్తం చేశారు. సిద్దార్థ 30 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి నలుగురు విద్యార్థులకు ఒక విద్యార్థి చొప్పున 550కుపైగా మారులు సాధించడం తమకు గర్వకారణం అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, తల్లిదండ్రులు ఉన్నారు.