Kabaddi competitions | ఓదెల, సెప్టెంబర్ 20 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఉత్కపల్లికి చెందిన ఆళ్ల శరణ్య రెడ్డి, ఉడుత శ్రీవల్లి ఎంపికయ్యారు.
వారిని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ శనివారం పాఠశాలలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య, పీడీ హరికృష్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.