ధాన్యం కొనరు నిర్లక్ష్యం వీడరు
జిల్లాలో యాసంగిలో లక్షా 93 వేల 330 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- కేంద్రాల్లోనే రాశులు
- మందడికొడిగా సేకరణ.. రైతుల పడిగాపులు
- తాలు, తప్ప పేరిట దోపిడీ.. నిండా మునుగుతున్న వైనం
- తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలింపులో అలసత్వం
- సిరిసిల్ల జిల్లాలో కొనుగోళ్లు అధ్వానం
- 236 సెంటర్లలో ఇదే తీరు
- 3 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్‌లో ఇప్పటివరకు కొన్నది 41 శాతమే
సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ గాడి తప్పింది. ప్రభుత్వ పట్టింపులేమి.. అధికారుల నిర్లక్ష్యంతో సేకరణ పూర్తి అధ్వానంగా.. మందకొడిగా సాగుతున్నది. పలుచోట్ల సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా వెనువెంటనే కొనకపోవడం, మరోవైపు తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలింపులో జాప్యంతో కేంద్రాల్లోనే ధాన్యం మూలుగుతున్నది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,25,808 మెట్రిక్ టన్నులు కేవలం (41 శాతమే) పూర్తికావడం పరిస్థితికి అద్దంపడుతున్నది. మరోవైపు తప్ప, తాలు పేరిట అదనపు తూకం వేస్తూ దోపిడీ చేస్తుండడంతో రైతాంగం నిండా మునుగుతున్న పరిస్థితి కనిపిస్తుండగా, పట్టని ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, మే 16( నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగిలో లక్షా 93 వేల 330 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 132, పీఏసీఎస్ 96, డీసీఎంఎస్ 1, మెప్మా 7 సెంటర్లు ఉండగా, కొనుగోళ్లు మొదలై నెల రోజులు దాటినా సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రక్రియ పూర్తిగా మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం లక్షా 25 వేల 808 మెట్రిక్ టన్నులు అంటే 41 శాతం మాత్రమే కొనుగోలు చేయడంతో సెంటర్లలోనే ధాన్యం పేరుకుపోతున్నది. ఈ నెలాఖరు వరకు ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తి చేయాల్సి ఉన్నా, క్షేత్ర స్థాయిలో ఆలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
ఆది నుంచీ అలసత్వమే..
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మొదటి నుంచీ నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. కేంద్రాలకు ధాన్యం వచ్చినా సెంటర్లు ప్రారంభించకపోవడం, ప్రారంభించిన తర్వాత వెనువెంటనే కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం చేయడం, తూకం వేసిన బస్తాలు ఎండకు బరువు తగ్గుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు.. మండుటెండలతో నిత్యనరకం చూస్తున్నామని వాపోతున్నారు. మరోవైపు తాలు, తప్ప, తరుగు పేరిట ధాన్యంలో కోత పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇక జిల్లాలోని పలు కేంద్రాల్లో లారీల కొరతతో రైతులే ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కొద్దిరోజులుగా కోనరావుపేట, ఇల్లంతకుంట, రుద్రంగి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, చందుర్తి పలు మండలాల్లో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండడంతో ఇటీవల ముఖ్యమంత్రి సైతం కొనుగోళ్లపై సమీక్షించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఈ క్రమంలో కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు దీంతో రెవెన్యూ శాఖ అధికారులు సహా పోలీస్, రవాణా విభాగం అధికారులు కేంద్రాల బాట పడుతున్న పరిస్థితి ఉంది. మరో 13 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి వస్తాయని వాతావరణ శాఖ సూచనతో ఆందోళన చెందుతున్న రైతుల్లో పలువురు దళారులకు అమ్ముకోవడం సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నది.
20 రోజులు పడిగాపులు పడ్డా
నేను ఎకరంన్నర భూమిలో వరి వేసిన. మూడు ట్రాక్టర్ల వడ్లు పండినయి. 20 రోజుల క్రితం రగుడులోని సెంటర్‌కు తీసుకవచ్చినం. వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసింది. సెంటర్లోనే ఆరబెట్టుకున్నా. 20 రోజులకు సీరియల్ వచ్చింది. సగం వడ్లే 30 బస్తాలే జోకిర్రు. సగం వడ్లను గడ్డి తాలు ఉందని ఆపిన్రు. మళ్లీ ఆరబెట్టాలని చెప్పిర్రు. చానా రోజులు తిప్పలు పడితే ఆఖరికి మిగిలిన వడ్లు జోకిర్రు. కానీ లారీలు లేక బస్తాలు సెంటర్లనే ఆగినయి. నిన్ననే మిల్లుకు పోయినయి.
– బూర నాగరాజు, యువరైతు రగుడు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

