Shishu Mandir | కోరుట్ల, జూన్ 11: భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు నిలుస్తాయని విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిరం పాఠశాలలో నూతనంగా నిర్మించిన పాఠశాల తరగతి గదులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు మందిరం పాఠశాలల్లో విద్యార్థులకు దేశభక్తి మిళితం చేసిన విద్యాబోధన అందిస్తారని పేర్కొన్నారు.
శిశు మందిరం పాఠశాలలు ఎక్కడ ఉన్నా సమాజంలో అందరూ ఆదరించాలని, వాటి అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన భవన నిర్మాణం కోసం పలువురు దాతలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేముల ప్రభాకర్, బూరుగు సత్యనారాయణగౌడ్, శ్రీనివాసరావు, బొడ్ల శ్రీనివాస్, పూర్వ ప్రధానాచార్యులు బండారి కమలాకర్, పాఠశాల ప్రబంధ కారిణి సమితి సభ్యులు డాక్టర్ వేముల రవికిరణ్, వడ్లకొండ రాజగంగాధర్, చెట్పల్లి శంకర్, వనపర్తి చంద్ర మోహప్, ఎలిమిల్ల మనోజ్ కుమార్, అందె శివ ప్రసాద్, నీలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.