Vaddiraju Ravichandra | కాల్వ శ్రీరాంపూర్, ఫిబ్రవరి 24 : శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న జగత్ మహామునీశ్వర స్వామి ఆలయంలో మార్చి 13 నుండి 15 వరకు నిర్వహించే శతహ రుద్ర యాగానికి తరలి రావాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కు ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేసినట్లు ఆశ్రమ పిఠాధిపతులు బసవత్తుల రాజమౌళి శ్వర స్వామి అందజేశారు.
ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ కు వచ్చి లోక కల్యాణార్థం జరిగే రుద్ర యాగంలో కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాకుబ్ రెడ్డి, ముల్కల్ల గోవర్ధన శాస్త్రి, విరాట్ మౌళి పాల్గొన్నారు.