Peddapally | పెద్దపల్లి కమాన్, నవంబర్ 24 : పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారిగా శారదను నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శారదా ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్నారు. కాగా, ఇంతకుముందున్న డీఈవో మాధవి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. దీంతో ఏడీ శారదకు డీఈవో(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు అప్పగించారు.