Pembatla | సారంగాపూర్, జనవరి 20 : సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలోని 102 ఆర్యవైశ్య గోత్రా స్థంబాలతో నిర్మాణం చేస్తున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయ ఆవరణలో మంగళవారం ఆలయ నిర్వహకుల ఆధ్వర్యంలో మాఘశుద్ధ విదియ సందర్భంగా కన్యకా పరమేశ్వరీ ఆత్మర్పణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ అర్చనలు, అభిషేకాలు, పూజలు, ప్రత్యేక పూజలు, పారాయణం, మంగళహారతులు తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు మర్యాల రాజన్న, యాశాల మల్లికార్జున్, గంప శ్రీనివాస్, పాత రమేష్, గుండ సురేష్, వావిలతాలశేఖర్, బొడ్ల కైలాసం, ఆర్చకులు శానగొండ శివకిరణ్ శర్మ, ఆర్యవైశ్యులు, మహిళలు, దాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.