Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మే20 : స్వయం సహాయక సంఘం సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు బాగున్నాయని శ్రీనిధి ఆర్ఎం ఆర్ దుర్గాప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ప్రమాదాశాత్తు దాసరి కనుకమ్మ ఇటీవల మృతి చెందింది. కాగా కనుకమ్మ మృతి విషయమై విచారణకు మొట్లపల్లికి వచ్చిన ఆర్ఎం సంఘం సభ్యులతో మాట్లాడారు.
ప్రతీ మహిళ సంఘంలో చేరి రుణం పొంది సక్రమంగా చెల్లింపులు జరపాలని సూచించారు. శ్రీనిధి ద్వారా రుణాలు పొంది సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని, మైక్రోఫైనాన్స్ లకు వెళ్లి ఆర్థిక నష్టాలకు పోవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ఎం దుర్గాప్రసాద్‌ను, సహాయ మేనేజర్ చైతన్యను సర్పంచ్ తులా మనోహర్‌రావు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, సీసీ ఉపేంద్ర, సీఏలు, వార్డు సభ్యుడు రాజేశం పాల్గొన్నారు.