Eye donation | ఓదెల, జూన్ 24 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదానం చేసిన ఎంబాడి చంద్రయ్య సంస్మరణ సభ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మరణాంతరం కండ్లు మట్టిలో కలిసిపోవడం కంటే, దానం చేయడం వల్ల ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించిన వారవుతారన్నారు.
ప్రజలు మూఢనమ్మకాలను వదిలి మరణించిన తర్వాత నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, క్యాతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.