Indurthi | చిగురుమామిడి, మార్చి 2 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు సోమవారం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. రసాయనిక శాస్త్ర జంతు జీవశాస్త్రాలకు సంబంధించిన విద్యుత్ మోటారు, జనరేటర్, ఊపిరితిత్తులు, గుండె, విద్యుత్ వాహకాలు, న్యూటన్ లాస్ పదార్థాల స్థితులను విద్యార్థులు తయారుచేసి పాఠశాలలో ప్రదర్శించి వివరించారు.
ప్రదర్శనను తిమ్మాపూర్, చిగురుమామిడి ఎంఈఓ లు శ్రీనివాసరావు, జయప్రద, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లావణ్య తిలకించారు. విద్యార్థులకు సుజనాత్మకతను పెంపొందిస్తూ, సైన్స్ విజ్ఞానాన్ని నిరంతరం అందజేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు భాషబత్తిని ఓదెలు కుమార్, తిరుపతి, మాధవిలను ఎంఈఓలు అభినందించారు. అనంతరం విద్యార్థులకు భౌతిక, జీవశాస్త్రాలలో క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.