న్యూఢిల్లీ: పాత వాహనాలను కాపాడేందుకు ఈ10 పెట్రోల్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ, భారత ఇథనాల్ బ్లెండింగ్ దూకుడు చర్యలపై ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఈ20శాతం(ఈ20) లక్ష్యానికి మించి ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచడానికి ముందు ‘ఆహారం వర్సెస్ ఇంధనం’ మధ్య సమతుల్యతను అంచనా వేయాలన్నారు. ఈ పాతవాహనాలను తొలగించే వరకు ఈ20తో పాటు ప్రత్యామ్నాయంగా ఈ10 పెట్రోల్‌ను అందించాలని నాగేశ్వరన్ సూచించారు.