AITUC Support | బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు
AITUC Support | బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్రమ్ తెలిపారు.
జగిత్యాల : బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు ( Bank Employees Strike ) ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ( AITUC Support ) ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్రమ్ ( Mukram ) తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 28, 29, 30లల్లో చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతిస్తున్నట్లు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
బ్యాంకు ఉద్యోగులు చాలాకాలంగా వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత బ్యాంకింగ్ రంగంలో పని గంటలు విపరీతంగా పెరగడం, మితిమీరిన పనిభారం, నిరంతర లక్ష్యాల ఒత్తిడి (Targets) కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పని విధానాన్ని ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే జీవో రూపంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎసమేని గణేష్ ,సుతారి రాములు, వెన్న మహేష్, ఉస్మాన్, కిరణ్, సాయిశ్వరి, సతీష్,శారదా తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

