Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. ఎనిమిదో రోజు హై జంప్‌లో అన్సీ సోజన్ (Ancy Sojan) త్రుటిలో స్వర్ణం చేజార్చుకోగా, పురుషుల విభాగంలో సర్వేవ్ కుశారే (Sarvesh Kushare) చరిత్రాత్మక వెండితో అదరగొట్టాడు. డెకథ్లాన్లో అంచనాలు అందుకున్న తేజస్విన్ శంకర్ కాంస్యం గెలుపొందగా.. మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పరుల్ చౌదరీ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో కంచు మోత మోగించింది.
నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు జోరు చూపిస్తున్నారు. మహిళల 200 మీటర్ల ఫైనల్లో హరిత భత్రా కంచు మోత మోగించిన కాసేపటికే లాంగ్ జంప్, డెకత్లాన్, స్టీపుల్ ఛేజ్‌లో పతకాలతో అదరగొట్టింది మన బృందం. మహిళల లాంగ్ జంప్ ఫైనల్లో సత్తా చాటిన అన్సీ సోజన్ అనూహ్యంగా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదో ప్రయత్నంలో 6.53 మీటర్ల దూరం దూకిన తను పసిడి పక్కా అనుకుంది.
Congratulations to Ancy Sojan on winning the Silver Medal in the Women’s Long Jump at the Asian Games 2026.#Cheer4Bharat pic.twitter.com/m9shpzeKXK
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 27, 2026
కానీ, చైనా అథ్లెట్ హుయాంగ్ ఇంగింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 6.55 మీటర్ల జంప్‌తో స్వర్ణం ఎగరేసుకుపోయింది. ఇదే విభాగంలో కాంస్యంపై ఆశలు పెట్టుకున్న శైలిల్ సింగ్‌కు సైతం చుక్కెదురైంది. 6.41 మీటర్లతో మూడో స్థానంలో నిలిచిన ఆమెను 6.46 మీటర్లతో టాన్ మంగీ(జపాన్) వెనక్కి నెట్టి పతకం పట్టుకుపోయింది.
పురుషుల హై జంప్‌లో సర్వేష్ కుశారే వెండి వెలుగులు విరజిమ్మాడు. ఫైనల్లో అతడు ఏకంగా 2.25 మీటర్లు జంప్ చేసి.. చరిత్రాత్మక పతకం ఒడిసిపట్టాడు. అయితే.. అతడు రెండో ప్రయత్నంలో ఈ దూరం అందుకోగా.. తొలి ప్రయత్నరంలోనే ఇంత దూరం దూకిన సుహాన్ ఫు(చైనీస్ తైపీ) కు స్వర్ణం దక్కింది. డెకథ్లాన్లో తేజస్విస్ శంకర్ తనకు తిరుగులేదని చాటాడు.
🇮🇳 DAY 4 | #AsianGames2026 Athletics
FIVE MEDALS IN ONE NIGHT! 🔥🏅
🥈 Ancy Sojan: Women’s Long Jump, 6.53 m
🥈 Sarvesh Anil Kushare: Men’s High Jump, 2.25 m
🥉 Harita Bhadra: Women’s 200m, 23.20
🥉 Tejaswin Shankar: Men’s Decathlon, 7,934 pts
🥉 Parul Chaudhary: Women’s 3000m… pic.twitter.com/SCiXcyg18K— Athletics Federation of India (@afiindia) September 27, 2026
పది క్రీడల్లో సత్తా చాటిన అతడు చివరిదైన 1500 మీటర్ల పరుగులో అగ్రస్థానం సాధించాడు. కానీ,7,934 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అతడు దేశానికి కాంస్యం అందించాడు. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పరుల్ చౌదరీ అంచనాలు నిలబెట్టుకుంది. 9:08.67 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని పూర్తి చేసి తను కాంస్యంతో మురిసింది. ఇదే విభాగంలో భారత అథ్లెట్ అంకిత నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.