Jharkhand | దిగొచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం.. జేపీఎస్సీ, ఏఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన
విద్యార్థుల 24 రోజుల నిరసనలకు ఎట్టకేలకు జార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. సోమవారం నిరసనకారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విజయం సాధించాయని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.
- జేపీఎస్సీ, ఏఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన
- 2014 నుంచి టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలపై సీఐడీ విచారణకు అంగీకారం
- సీఎం హేమంత్ సోరెన్ ప్రకటన
రాంచి : విద్యార్థుల 24 రోజుల నిరసనలకు ఎట్టకేలకు జార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. సోమవారం నిరసనకారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విజయం సాధించాయని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. విద్యార్థుల డిమాండ్లలో కొన్నింటిని ఇప్పటికే అంగీకరించామని.. తాజాగా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జేపీఎస్సీ నియామక పరీక్షతో పాటు జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2014 నుంచి టీడీపీఎల్ సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షలపై సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. అలాగే టీడీపీఎల్ ప్రకటించిన అన్ని ఫలితాలను కూడా రద్దు చేస్తున్నట్టు హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జితో కూడిన కమిటీ పరీక్షల్లో అవకతవకలపై ప్రత్యేక విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారు.
పరీక్షల్లో సంస్కరణలు..
సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పాటించకపోవడం వల్లే అవకతవకలు జరిగాయి. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి అమితాబ్ కౌశల్ నాయకత్వంలో సంస్కరణలు చేపడుతాం. విద్యార్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉండే నిపుణుల బృందం వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఎంఎండీఆర్ చట్టంలో చేసిన మార్పులపై కూడా పరిశీలిస్తున్నాం. అవసరం అయితే వీటన్నింటిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాం. ఇప్పటికే సీఐడీ విచారణలో భాగంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో కొందరి అరెస్టులు జరిగాయి. మిగిలిన వారిని గుర్తిస్తున్నాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు’ అని సీఎం హేమంత్ సోరెన్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

