Save Regunta Government School | మల్లాపూర్, జులై 19: ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువుతున్నారు. దీంతో పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులలో ఒక టీచర్ ని వేరే పాఠశాలకు బదిలీ చేయగా విద్యార్థుల తల్లిదండ్రులు, యూత్ సభ్యులు గ్రామస్తులు రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేశారు.
మళ్లీ తిరిగి యథావిధిగా తమ పాఠశాల నుండి వేరే పాఠశాలకు సదరు ఉపాధ్యాయురాలని బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉపాధ్యాయురాలినీ బదిలీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, యూత్ అసోసియేషన్ సభ్యులు సమిష్టిగా కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారి స్పందించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బదిలీ నిలిపివేయాని పక్షంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రాజు పోలీస్ సిబ్బందితో కలిసి ఆందోళనకారులతో మాట్లాడి శాంతిపజేశారు.
ఉన్నతాధికారులకు సమస్యను వివరించి త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణవేణి మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య, యూత్ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.