Peddapally | పెద్దపల్లి, నవంబర్ 23 : జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతిని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి చిత్రపటానికి అదనపు కలెక్టర్ దాసరి వేణు పూల వేసి నివాళులు ఆర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా సత్యసాయి సేవా ట్రస్ట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.