Chigurumamidi | చిగురుమామిడి, డిసెంబర్ 22: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం సర్పంచ్లకు గ్రామ ప్రత్యేక అధికారులు బాధ్యతలు అప్పగించారు. చిగురుమామిడిలో సర్పంచ్ గా ఆకవరం భవాని, రేకొండలో అల్లెపు సంపత్, బొమ్మనపల్లిలో కొంకట మౌనిక, ఇందుర్తిలో చింతపూల నరేందర్, సుందరగిరిలో జంగ శిరీష, చిన్న ముల్కనూరులో సాంబారి భారతమ్మ, రామంచలో ఒంటెల కిషన్ రెడ్డి, ముదిమాణిక్యంలో బోయిని రమేష్, నవాబుపేటలో గూళ్ల రజిత, పీచుపల్లి లో పీచు సత్యనారాయణరెడ్డి, లంబాడి పల్లెలో కాటం సంపత్ రెడ్డి, సీతారాంపూర్ లో గోగురి లక్ష్మి, ఉల్లంపల్లిలో అలువాల శంకర్, ఓగులాపూర్ లో గడ్డం రమాదేవి, గాగిరెడ్డిపల్లిలో సన్నీళ్ల కవిత, గునుకుల పల్లెలో గురుకుల మధుసూదన్ రెడ్డి, కొండాపూర్ లో మార్క రాజ్ కుమార్ బాధ్యతలలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ ప్రత్యేక అధికారులు శాలువాతో సర్పంచ్ తో పాటు పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని, గ్రామస్తుల సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారులు ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ రమేష్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మోహినుద్దీన్, ఎంపీవో బత్తుల కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.