బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాపన్న వర్ధంతి
Sircilla | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 2: సర్దార్ సర్వాయి పాపన్న సేవలు మరువలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈకార్యక్రమంలో జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, ఎల్డీఎం మల్లికార్జున్ రావు బీసీ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.