Rekurthi | కమాన్ చౌరస్తా, జనవరి 28 : వనదేవతలు సమ్మక్క- సారలమ్మ మూడు రోజుల జాతరకు రేకుర్తి ముస్తాబైంది. జాతరలో తొలిఘట్ట మైన సారలమ్మ బుధవారం గద్దెనెక్కనున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా పోలీసులు రోప్ బృందాన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో 20వరకు హుండీ లను ఏర్పాటు చేయడంతో పాటు, డిజిటల్ లావాదే వీల కోసం క్యూర్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో మారుతి వివరించారు. నేడు సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెల వద్దకు రానున్నారు. 30న దేవతలకు మొక్కులు, 31న అమ్మవార్లు వనప్రవేశం చేయను న్నారు.
జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూ లల నుంచి దాదాపు నాలుగు లక్షల పైచిలుకు భక్తులు వచ్చే ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జాతర రేకుర్తిలో ఏర్పాట్లను స్థానిక నాయకులు పర్యవేక్షించారు. అలా గే, నగునూర్, ఇరుకుల్ల, నగరంలోని హౌసింగ్ బోర్డు, చింతకుంట శివారులోని గద్దెల వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రేకుర్తిలో జాతర కమిటీ, మాజీ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణగౌడ్, జాతర చైర్మన్ పిట్టల శ్రీనివాస్, జాతర ఈవో మారుతి ఆధ్వర్యంలో తొలిపూజలు నిర్వహించి, ఎదుర్కొళ్లు నిర్వహించారు. కొంత మం ది భక్తులు మొక్కులు సమర్పించారు.