కమాన్చౌరస్తా, జనవరి 12 : నగరంలోని పలు విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోరా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు చేస్తూ సందడి చేశారు. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే, రిషి ప్లే స్కూల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకలను విద్యాసంస్థల చైర్మన్ కామారపు చెన్నప్ప ప్రారంభించారు. ఇక్కడ పాఠశాల ఇన్చార్జి కౌశల్, అడ్మిన్ రజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, అల్గునూర్లోని సుభోది పాఠశాలలో విద్యార్థులు సంక్రాంతి సంబురాల్లో భాగంగా ప్రత్యేక దుస్తుల్లో హాజరయ్యారు. ఇక్కడ ప్రిన్సిపాల్ రాధ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 12: ముకరంపురలోని వాణీనికేతన్ స్కూల్లో గురువారం సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే, వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల డైరెక్టర్ రేణుక, అకడమిక్ కో-ఆర్డినేటర్ నీలకంఠ, ప్రిన్సిపాల్ ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 12: మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, ఏవో, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ రూరల్, జనవరి 12: స్థానిక విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల వైస్ చైర్మన్ అరవింద్ ఆనందరావు, డీన్ ప్రదీప్, లక్ష్మణ్, పవన్రావు, మాధవి, ఆధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.