సుల్తానాబాద్, జనవరి 5: సంక్రాంతి ముందస్తు వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో వైభవంగా జరిగాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల తయారీ, వ్యవసాయ పనులు బొమ్మల కొలువులతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.