Sanitation workers | కార్పొరేషన్, జూన్ 28 : కరీంనగర్ నగరపాలక సంస్థల పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ముందుట ఆందోళన చూపెట్టారు. పారిశుద్ధ పనుల విషయంలో కార్మికులను వ్యక్తిగత కక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పారిశుద్ధ విభాగం అధికారులు సిబ్బంది కార్మికులను అవస్థలకు చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే కార్మికులకు రావాల్సిన సామగ్రిని వేతనంలో సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల పట్ల సిబ్బంది అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులు బదులు నిర్వహిస్తున్న గయాజులు వేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.