జమ్మికుంట: మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూర పెళ్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో సిబ్బందిపై అర్ధరాత్రి మద్యం సేవించిన ఇసుక అక్రమార్కులు దాడులు చేసేందుకు యత్నించారు. నానా బూతులు తిడుతూ.. చెక్ పోస్ట్ సిబ్బందిని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశారు.
చెక్‌పోస్టులో పైసలు వసూలు చేస్తూ కొన్ని ట్రాక్టర్లు వదిలిపెడుతున్నారంటూ.. అందరి ఇసుక వాహనాలు ఎందుకు వదిలిపెట్టడం లేదంటూ హంగామా చేశారు. చెక్‌పోస్ట్ పై దాడికి యత్నించిన ఇసుక అక్రమార్కులంతా గంజాయి, మద్యం సేవించినట్లు తెలిసింది. జరిగిన సంఘటనపై పట్టణ సీఐ ని వివరణ కోరేందుకు యత్నించగా స్పందించలేదు.