Vemulawada | వేములవాడ, జనవరి 23: వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ కమిషనర్గా విధులు నిర్వహించిన అన్వేష్ మంచిర్యాలకు బదిలీ కాగా మంచిర్యాల కమిషనర్ గా ఉన్న సంపత్ కుమార్ వేములవాడ బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్ ను కార్యాలయ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.