సిరిసిల్ల రూరల్/కోనరావుపేట/ఇల్లంతకుంట/ ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, ఫిబ్రవరి 24: జిల్లాలోని పలు గ్రామాల్లో వనదేవతల జాతరకు భక్తజనం శుక్రవారం పోటేత్తెంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, బైండ్ల వారి నృత్యాల మధ్య మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. ఒడి బియ్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం వనదేవతలు వన ప్రవేశం చేయడంతో జాత ర ముగియనున్నది.
తంగళ్లపల్లి మండలంని ఒబులాపూర్, మండెపల్లిలో వనదేవతల జాతరలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కోనరావుపేట మండలంలోని శివంగాళపల్లిలో సమక్క సారక్క గద్దెల వద్ద వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మె డ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ఎంపీపీ చంద్రయ్యగౌడ్, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, శివతేజరావు, కాసర్ల రాజు, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు మోతె గంగారెడ్డి, నేరేళ్ల జ్యోతి పాల్గొన్నా రు.
ఇల్లంతకుంటలోని సమ్మక్క-సారక్కను ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. ముస్తాబాద్‌లో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు అకరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి తమ నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లించుకున్నా రు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో బోనాల ఊరేగింపు నిర్వహించారు.
బోనాలను బస్టాండ్ నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు తీసుకెళ్లారు. అనంతరం పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇక్కడ ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి, పీఏసీఎస్ డైరెక్టర్ ల్యాగల సతీశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కొండాపురం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వనదేవతల జాతర వీర్నపల్లి మండలంలోని బాబాయిచెరువుతండా, శాంతినగర్‌లో ఘనంగా జరిగింది. ఎంపీటీసీ బానోత్ పద్మ, మాజీ సర్పంచ్ కమటం మల్లేశం, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవార్లకు ప్రత్యేజ పూజలు నిర్వహించారు.