హౌసింగ్‌బోర్డుకాలనీ, డిసెంబర్ 22: “సీఎం సార్.. మా అమ్మానాన్నల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి” అని సమగ్ర శిక్షా ఉద్యోగుల పిల్లలు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వేడుకున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ డిమాండ్లను వెంటనే పరిషరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరగా, ఆదివారం దీక్షలో వారితో పిల్లలు, కుటుంబ సభ్యులు కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతేడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి హనుమకొండలోని ఏకశిల పార్ వద్ద చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వందరోజుల్లో సమస్యలను పరిషరిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో జిల్లా గౌరవాధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, రవిచంద్ర, బీ శ్రీకాంత్, కేజీబీవీ ప్రత్యేకాధికారులు ఎం అజిత, బీ రమాదేవి, ఎన్ పూర్ణిమ గౌతమి, పీ మాధవి, పీ కిరణ్ జ్యోతి, ఎం స్వప్న, ఏ సునీత, పీ కవిత, వై భార్గవి, ఇ లావణ్య, కే సుప్రియ, కే రజిత, జీ పుషరాణి, కే మధులత, తదితరులు పాల్గొన్నారు.