Donating blood | సుల్తానాబాద్ రూరల్ మే 16: 30వ సారి రక్తదానం చేసి మడ్డి సాయి కుమార్ గౌడ్ అనే యువకుడు మానవత్వం చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన సుజాత కరీంనగర్ లోని భద్రకాళి హాస్పటల్ లో స్పైన్ సర్జరీ కోసం రక్తం అవసరం పడింది. కాగా బాధితులు ఓ నెగటీవ్ బ్లడ్ కావాలని వై కే ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరిగేల వెంకటేష్, వై కే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్‌ను సంప్రదించారు.
కాగా సాయి కిషోర్ గౌడ్ స్పందించి పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితే రాజు పల్లి గ్రామానికి చెందిన సాయికిషోర్ గౌడ్ కరీంనగర్ లోని మైత్రి బ్లడ్ బ్యాంక్ లో బాధితురాలకి రక్తదానం చేశారు. కాగా ఇది 30వ సారి కావడంతో అతడిని పలువురు అభినందించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులు వై కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు కండెం సురేష్ , అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, పలువురు సాయి కిషోర్ కు కృతజ్ఞతలు తెలిపారు.