NAVODAYA | రామగిరి, మార్చి 26 : మంగళవారం విడుదల చేసిన జాతీయ స్థాయి జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (సెంటనరీ కాలనీ) ఆధ్వర్యంలో బేగంపేట గ్రామంలో నిర్వహిస్తున్న సాయి ప్రగతి విద్యానికేతన్ క్వాన్వెంట్ పాఠశాల కు చెందిన ఈర్ల విక్రమాదిత్య అనే విద్యార్ధి నవోదయ గురుకులం పాఠశాలలో సీట్ సాధించాడు. కాగా విక్రమాధిత్యను బుధవారం కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్ తదితరులు పాఠశాలలో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.