Bhagiratha Maharshi Jayanti | వీణవంక, మే1 : మే4న సగరుల కుల గురువైన భగీరథ మహర్షీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. ఈ మేరకు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో గురువారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా సగరులు ఉన్న అన్ని గ్రామాల్లో భగీరథుడి జయంతి వేడుకలను ఉత్సవంలా నిర్వహించాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం భగీరథ మహర్షీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకునేందుకు రూ.6లక్షలు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.