Kolanur | ఓదెల, సెప్టెంబర్ 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని వరసిద్ధి వినాయక మండపంలో శుక్రవారం కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుడు నందగిరి శ్రీనివాస్ శర్మ లక్ష్మి, గౌరీ, సరస్వతి, నవగ్రహ పూజలు నిర్వహించారు.
కుంకుమ పూజ చేయడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని మహిళలు నమ్ముతారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీర్ల సదయ్య, బండారి ఐలయ్య, కొంగర అనిల్, బండారి శ్రీనివాస్, జిగురు రాజేందర్, జంగం సతీష్, ఉప్పుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.