Odela | ఓదెల, ఆగస్టు 8 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన కనికిరెడ్డి మల్లేష్ (47)శరీర దానానికి అంగీకారం తెలుపుతూ శుక్రవారం సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సమక్షంలో శరీర దాన అంగీకార పత్రాన్ని ఇచ్చారు.
మల్లేష్ తన మరణానంతరం ఉపయోగపడే దేహం మట్టిలో వృథాగా పోనీయకూడదని తలచి, సదాశయ ఫౌండేషన్‌కు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ కాళోజి నారాయణరావు తాను జీవించినంత కాలం సమాజోద్దరణకు పాటుపడి, మరణానంతరం తన నేత్రాలు శరీరం దానం చేసి మానవ మనుగడకు తోడ్పడి ఆదర్శంగా నిలిచారని, ఆయన స్పూర్తితో మన ఓదెల నివాసి మల్లేష్ శరీర దానానికి ముందుకు రావడం శుభ పరిణామం, స్పూర్తి దాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సదాశయ జాతీయ కార్యదర్శి భీష్మాచారి, క్యాతం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,క్యాతం మల్లేశం,మేరుగు సారంగం, తుమ్మ మధుకర్ గోలి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.