తొలకరి పలుకరించింది. రైతన్నల్లో ఆనందం వెల్లివిరిసింది. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగానైనా మురిపించడంతో ఉమ్మడి జిల్లా రైతులు సాగు బాట పట్టారు. పుష్కలమైన కాళేశ్వర జలాలు, చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు ఉండడం, రేపటి నుంచే రైతుబంధు పైసలు పడనుండగా, కోటి ఆశలతో సేద్యానికి సిద్ధమయ్యారు. దుక్కులు దున్ని, నేలను అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక సిద్ధం చేసి, అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో కొనుగోలు చేసే పనిలో పడ్డారు.
– కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు శుభగడియ మొదలైంది. చిరు జల్లు కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతులు సాగు బాట పట్టారు. ఊరూరా రైతులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. దుక్కులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు వానకాలం సీజన్‌కు సంబంధించి రేపటి (సోమవారం) నుంచే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో వేయనుండగా, రైతులు ఉత్సాహంగా ఉన్నారు. పెట్టుబడి కోసం బ్యాంకులనో, వడ్డీ వ్యాపారులనో ఆశ్రయించే అవసరం లేకుండా సంబురంగా సాగుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారులు సాగు ప్రణాళికను సిద్ధం చేసి, రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచడంతో ఇప్పటికే వాటిని ఇండ్లకు తెచ్చుకున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు కూడా వేస్తున్నారు.
జిల్లాల వారీగా పంటల సాగు అంచనా
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి కావాల్సిన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉం చింది. అలా గే సబ్సిడీ విత్తనాలు సమకూర్చింది. జిల్లా లో మొత్తం 17 సేల్స్ కౌంటర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులకు చెప్పేది ఒక్కటే. ఇప్పుడే సాగు పనులు మొదలు పెట్టవద్దు. ఇంకా వర్షాలు కురిసేదాకా ఆగాలి.
– దోమ ఆదిరెడ్డి, డీఏవో (పెద్దపల్లి)