కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 12 : కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీనిని ప్రముఖ గాయని మధుప్రియ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూర్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో సేవలందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఉత్తర తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. మన జిల్లాలో ట్రావెల్స్ ప్రారంభోత్సవానికి తనను ముఖ్య అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ట్రావెల్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తాను పాడిన ‘గోదారి గట్టుమీద రామచిలకానే’ పాటను మరోసారి పాడి అలరించారు. అనంతరం సంస్థ చైర్మన్ ఆర్వీ రమణ మాట్లాడుతూ, కాశీ, అయోధ్య టూర్‌కు 21,999, బ్యాంకాక్‌కు 33,999, మలేషియాకు 49,999, యూరప్‌కు 3,25,000 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. చార్దామ్, అమర్నాథ్, ముక్తినాథ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, తమిళనాడు వంటి దేశీయ యాత్రలతోపాటు విదేశీ యాత్రలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశం ఈ నెల 15 వరకు మాత్రమే ఉందని సూచించారు.