Illandakunta | ఇల్లందకుంట, జనవరి 11 : ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరునగరి వేణుగోపాల్ సతీమణి వైష్ణవి ఇటీవల మృతి చెందింది. కాగా బాధిత కుటుంబాన్ని జిల్లా అధికార ప్రతినిధి పైడిపల్లి భీమన్న ఆధ్వర్యంలో ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైష్ణవి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమన్న మాట్లాడుతూ వేణుగోపాల్ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించి ఆయురారోగ్యాలు కల్పించాలని కోరారు.
అనంతరం జమ్మికుంట, ఇల్లంద కుంట మండలాలకు చెందిన వైద్యులు రూ.40 వేల ఆర్థిక సాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల అధ్యక్షుడు మండల జయమూర్తి, వేముల అశోక్, సలీం పాషా, పంజాల తిరుపతి, ధీటి భీమన్న, కొడం శంకర్, నాగేశ్వర్ రావు షిండే, ఆశం రాజేందర్, హరి, శీను, చిరంజీవి, దామోదర్, తుక్కరావు తదితరులు పాల్గొన్నారు.