Korutla | కోరుట్లలో ప్రశాంతంగా ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు
కోరుట్ల పట్టణంలోని టీజీ ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో భాగంగా కోరుట్ల ఆర్టీసీ డిపోలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Korutla | కోరుట్ల, సెప్టెంబర్ 9 : కోరుట్ల పట్టణంలోని టీజీ ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో భాగంగా కోరుట్ల ఆర్టీసీ డిపోలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత పదేళ్లుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సరైన వేదిక లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే సంఘాన్ని ఎన్నుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోరుట్ల డిపోలో 186 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 140 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా డిపో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

