‘కోల్ టూరిజం-సింగరేణి దర్శన్’
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పర్యాటక ప్రాంతాలకు బ స్సులు నడపంపై దృష్టిపెట్టింది
- కోల్‌బెల్ట్ దర్శననానికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు
- నేడు జూబ్లీ బస్‌స్టేషన్‌లో ప్రారంభించనున్న ఎండీ సజ్జనార్
- 28న ఉదయం 9 గంటలకు కరీంనగర్‌కు
తెలంగాణచౌక్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పర్యాటక ప్రాంతాలకు బ స్సులు నడపంపై దృష్టిపెట్టింది. ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నది. ఇదే కోవలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప ర్యటన కోసం ‘కోల్ టూరిజం- సింగరేణి దర్శన్’ పేరిట ప్రాణహిత, గోదావరిలోయ సందర్శించేందుకు హైదాబాదర్ జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి బస్సులను నడపాలని నిర్ణయించింది. 28 తేదీ నుంచి నడుపనున్న ఈ బస్సులను మంగళవారం సంస్థ వైస్ చైర్మన్,అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ హైదారాబాద్ జూబ్లీ స్టేషన్లో ప్రారంభించనున్నారు.
28న ఉదయం 6 గంటలకు జూబ్లీ బస్‌స్టాండ్ నుంచి బయల్దేరి, 9 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. నగరం మీదుగా సింగరేణి కాలరీస్ చేరుకొని పర్యటన తరువాత జైపూర్ నుంచి బయల్దేరి రాత్రి 11 గంటలకు జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంటుంది. 7 జనవరి 2023 నుంచి ప్రతి శనివారం టూరిజం బస్సును నడుపనున్నారు. ప్యాకేజీలో భాగంగా 350 కిలో మీటర్ల పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు,అండర్ గ్రౌండ్ మైనింగ్స్, ఓపెన్ కాస్ట్ గనులు.
జైపూర్ విద్యుత్పవర్ ప్లాంట్ ను తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ నుంచి రూ 1850, కరీంగనర్ నుంచి 1050గా టికెట్ ధర నిర్ణయించారు.అయితే డిసెంబర్ 31లోగా బుకింగ్ చేసుకున్న ప్రయా ణికులకు రూ 250 రాయితీతో జూబ్లీ నుంచి రూ 1600, కరీంనగర్ నుంచి 800 అందించనున్నారు. సింగరేణి దర్శన్‌కు వెళ్లే పర్యాటకులు ఆర్టీసీ వెబ్సైట్ www. tsrtconline.inలో టికెట్లు బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు
ప్యాకేజీని వినియోగించుకోవాలి..
టీఎస్ ఆర్టీసీ సింగరేణి దర్శన్ టూరిజం ప్యాకేజీని ప్రారంభిస్తున్నది. ప్రసిద్ధి గాంచిన సింగరేణి బొగ్గు గనులతో పాటు జైపూర్‌లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను కూడా దర్శించుకో వచ్చు. ఈనెల 28న కరీంనగర్ బస్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటలకు టూరిజం బస్సు అందుబా టులో ఉంటుంది. వైబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ప్రతి శనివారం క్రమం తప్పకుండా బస్సును నడుపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పర్యాటక ప్రాంతాలకు బ స్సులు నడపంపై దృష్టిపెట్టింది
తక్కువ చార్జీలతో అవకాశం..
టీఎస్ ఆర్టీసీ ప్రారంభిస్తున్న సింగరేణి దర్శన్ పర్యాటక ప్యాకేజీ బాగుంది. తెలంగాణ బొగ్గు గనుల మన పక్కనే ఉన్న చేసే అవకాశం కలుగలేదు. ఇప్పడు ఆర్టీసీ సంగరేణి ప్యాకేజ్‌తో తిలకించే అవకాశం వచ్చింది. తక్కువ చార్జీలతోనే దర్శన భాగ్యం కల్పించింది. ఇది మంచి నిర్ణ యం. ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుంది. సంస్థ లాభాలు గడిస్తుంది.
– చకిలం శ్రీనివాస్,(మేము సైతం యువసేన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

