MLA Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 7 : పెద్దపల్లి మండలం పెద్దకల్వల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు నిధులను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎలిగేడు మండలం శివపల్లిలో ఆయన నివాసంలో గ్రామస్థులకు ఎమ్మెల్యే మంజూరు పత్రం అందజేశారు.
మాజీ ఉపసర్పంచ్ అర్కుటి సంతోష్ యాదవ్ ఆద్వర్యంలో నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యే విజయరమణా రావుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారెంగుల రమేష్, మాజీ ఎంపీటీసీ ఉప్పు కొమురయ్య, మాజీ ఉపసర్పంచ్ అర్కుటి సంతోష్ యాదవ్, డాక్టర్ రమేష్, ఉప్పు సత్తి పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Rs. 40 lakhs sanctioned for the development of Peddakalvala temple.. Villagers thank MLA Vijayaramana Rao