Ramagundam Lions Club | కోల్ సిటీ, సెప్టెంబర్ 5: లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు చేయూత అందించారు. ఈ మేరకు వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలో జరిగిన నిమజ్జన వేడుకల నిర్వహణ నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల అభ్యర్ధన మేరకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్పందించి తమవంతుగా శుక్రవారం రూ.18వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిమజ్జనానికి తరలివెళ్తున్న ఉత్సవ మూర్తులకు కొబ్బరికాయలు కొట్టి ఘనంగా సాగనంపడానికి గానూ అయ్యే ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేసిన క్లబ్ ప్రతినిధులకు వీహెచ్పీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఆర్సీ రాజేందర్, జీఎంటీ రామస్వామి, పీఎస్టీలు ఎల్లప్ప, సారయ్య, రాజేంద్ర కుమార్, సీనియర్ సభ్యులు తానిపర్తి గోపాల్ రావు, భిక్షపతి, గుండా రాజు తదితరులు పాల్గొన్నారు.