Ravinder Singh | కార్పొరేషన్, ఫిబ్రవరి 2 : తానను కార్పొరేటర్‌గా గెలిపిస్తే తన డివిజన్ 58లో ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, ఆడ పిల్లల పెళ్లిలకు రూ.25,116, అదే విధంగా మగపిల్లవాడు పుడితే రూ.5 వేలు అందిస్తానని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డివిజన్లోని ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులో ఉండడంతో పాటుగా వారి సేవ చేయాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చానని తెలిపారు. డివిజన్లో ఎవ్వరికి ఆడ, మగ పిల్లలు పుట్టిన వారికి ఆయా అమౌంట్‌ను డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పెళ్లిలకు డబ్బులను అందించటం జరుగుతుందన్నారు.
తాను నగర మేయర్‌గా ఉన్న సమయంలోనే రూపాయికే నల్లా కనెక్షన్, అంత్యక్రియాల కార్యక్రమాలను అమలులోకి తీసుకువచ్చానని, ఇప్పుడు తన డివిజన్లో ఈ కార్యక్రమాలను తీసుకుంటానని పేర్కొన్నారు.