Road accidents | పెద్దపల్లి, జనవరి 2 : ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చనని జిల్లా రవాణాధికారి పీ రంగారావు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విద్యార్ధులు, డ్రైవర్లలచే రోడ్డు భద్రతపై అవగాహన, రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రంలో సీటు బెల్ట్ ధరించి కారు నడుతున్న డ్రైవర్లకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీ పువ్వు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణాధికారి మాట్లాడుతూ, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా పెద్దపల్లిలోని ఇండియా మిషన్ హై స్కూల్, క్రిసెంట్ హైస్కూల్, రంగంపల్లి ప్రాథమిక పాఠశాల, నిట్టూర్లోని జడ్పీహెచ్ఎస్, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ జడ్పీహెచ్ఎస్, ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్, ధర్మారంలోని ప్రభుత్వ జానియర్ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పంచామని చెప్పారు.
ఆర్టీవో కార్యాలయంలో రోడ్డు భద్రతపై అవహగాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈనెలాఖరు వరకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు షేక్ మసూద్ అలీ, శివ స్వప్న, మధు, నిఖిల్ రెడ్డి, వంశీ కృష్ణ, ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు.