Road accident | పెగడపల్లి : కోతిని తప్పించబోయి వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో ఐకేపీ (సెర్ప్) సీపీ రవికుమార్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని నందగిరి గ్రామం గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఐకే పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన రవికుమార్ ఐకేపీ(సెర్ప్)లో సీసీగా పనిచేస్తున్నాడు. కాగా అతడు రోజువారిగా విధుల్లో భాగంగా అతడి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.
ఈ క్రమంలో అతడి వాహనానికి కోతి అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి కింద పడిపోయి గాయాలయ్యాడు. చికిత్స నిమిత్తం అతడిని కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. డీఆర్డీవో రఘువరన్, ఏపీడీ సునీత, పెగడపల్లి ఏపీఎం రవివర్మ, జిల్లా సెర్ఫ్ అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.