Chada Venkat Reddy | జగిత్యాల, జూన్ 13 : ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ, మతోన్మాధాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా సీపీఐ నాలుగో మహాసభలకు చాడ వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ ముందు చూపుతో భిన్నత్వంలో ఏకత్వం, కుల, మతాలకతీతంగా రాజ్యాంగాన్ని రచిస్తే నేటీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు పర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు కావస్తున్నా రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందడంలేదన్నారు.
పౌర హక్కుల నాయకులు, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ లను అంతం చేయాలనీ చూస్తోందని దుయ్యబట్టారు. కాగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ చేస్తున్నవి బుటకపు ఎన్ కౌంటర్లేనని, బూటకపు ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ప్రజల దగ్గర మోకరిళ్లిన నాయకులు అధికారంలోకి రాగానే, అన్ని హామీలను మర్చిపోయి కనుమరుగవుతున్నారని, ఇదేనా ప్రజాప్రభుత్వమని చాడ ప్రశ్నించారు.
ఎర్ర జెండాతోనే అంగన్వాడీలు, ఆశాలు, ఇతర ఉద్యోగుల హక్కులు సాధించుకున్నారని, సీపీఐ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని వెంకట్ రెడ్డి అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సీపీఐ వందేళ్లు ఉత్సవాలు జరుపుకుంటుందని, సుధీర్గ పోరాటాలు చేసిందని పేర్కొన్నారు. విడిపోతే పడిపోతామని తెలుసుకున్న కమ్యూనిస్ట్ లమైన మనం ఇప్పటికైనా ఐక్యమై మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి గద్దే దీంచేవరకు పేదల కోసం పోరాటలు చేయాలనీ చాడ పిలుపునిచ్చారు.
అంతకుముందు జగిత్యాల టవర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎర్రసైన్యం ర్యాలీగా తహసీల్ చౌరస్తా మీదుగా జంబీ గద్దె నుండి దేవిశ్రీ గార్డెన్లో జరిగిన మహాసభకు చేరుకొని సీపీఐ జెండా ఎగురవేసి గీతాలు ఆలపించారు. ర్యాలీలో సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొనగా వెన్న సురేష్ నాయకత్వంలో సాగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొక్కుల శాంత, సీపీఐ జిల్లా కోశాధికారి ఏండీ ముక్రం, టీజేఎస్జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జనవిజ్ఞన వేదిక రాష్ట్ర నాయకులు ఆముద లింగారెడ్డి, టీపీ జేఏసీ స్టేట్ స్టిరింగ్ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పొన్నం రాజమల్లు, నాస్తిక సంఘం జిల్లా నాయకులు ఉప్పులేటి నరేష్, జిల్లా నాయకులు సుతారి రాములు, ఎన్నం రాధ, ఏద్దండి భూమయ్య, ఇరుగురాల భూమేశ్వర్, మోనుగురి హన్మంతు, వెన్న మహేష్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏండీ అక్రమ్, శ్రీగాధ దేవదాస్, బొల్లె లక్ష్మణ్, కోరుకంటి శ్రీనివాస్, ఉస్మాన్, రాచర్ల సురేష్, మౌలానా,కూన సరస్వతి, మల్లేశం, రాములు, సమీర్, రాంబాబు, రమేష్, దశరథం, ప్రవీణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా మహాసభతో ఎరుపేక్కిన జగిత్యాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన జిల్లా 4వ మహాసభలతో జగిత్యాల పట్టణం సీపీఐ జెండాలతో ఎరుపేక్కింది. పట్టణంలోని వివిధ కూడళ్లలో సిపిఐ జిల్లా నాయకులు సిపిఐ జెండాలు, తోరణాలు కట్టడం, ఎక్కడ చుసిన కనిపించడంతో ఎర్ర జెండాల మయమైంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా టవర్ నుండి మహాసభ ప్రాంగనం వరకు గీతాలు ఆలపించడం, డప్పు చప్పుళ్లు, సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు జగిత్యాల జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఎర్ర సైనికులతో జగిత్యాల పట్టణం జాతరను తలపించింది. సీపీఐ, అనుబంద సంఘాల నాయకుల సహకారంతో సీపీఐ 4 వ జిల్లా మహాసభలు విజయవంత మయ్యాయి.