Huzurabad Rtc | హుజురాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలో భాగంగా శుక్రవారం హుజురాబాద్ డిపో గేటు ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం సూపరిండెంట్ కు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు మాట్లాడుతూ 2017 లో సవరించిన రెండు పే స్కేలు ఏరియర్స్, డి ఎ ఎరియర్స్, 2022 నుంచి అందాల్సిన లీవ్ ఇన్క్యాస్మెంటు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా సూపర్ లగ్జరీలో వృద్ధులైన భార్యాభర్తలకు ఫ్రీ ప్రయాణం, మృతిచెందిన రిటైర్మెంట్ కార్మికుల దహన సంస్కార్లకు అదే రోజు రూ.30 వేలు అందించాలని, 40 ఏళ్లు, 35 ఏళ్లు, 30 ఏళ్లపాటు ప్రజలకు సేవలందించిన రిటైర్ అయిన వృద్ధ కార్మికులతోపాటు అనారోగ్యానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రిటైర్మెంట్ సూపరింటెండెంట్ వివిఆర్ రెడ్డి, ఎల్.సారయ్య. శుభ వర్ధన్, ప్రభాకర్ రెడ్డి, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, పిఎల్ రావు, వీడి రెడ్డి, పీ ఎస్ రెడ్డి, ఈవిఆర్ నరసయ్య, జి.ఎం రెడ్డి, వెంకటస్వామి, అప్పని నారాయణ తదితరులు పాల్గొన్నారు.