Allocate land | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలో బంజారా భవనం నిర్మాణం కోసం 20 గుటంల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ ఆనంద కుమార్‌కు మండల బంజారా నాయకులు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఏడుమోటలపల్లి తండలో 8 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నందున సర్వే చేపట్టి అందులో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వ వరి ధాన్యకొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు తహసీల్దార్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో బంజారా సంఘం ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడు నగావత్ జీవనానాయక్, సంఘం నాయకులు శ్రీనునాయక్, తిరుపతినాయక్, అంజినాయక్ తదితరులున్నారు.