Ration dealers | కోరుట్ల, ఆగస్టు 25 : రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు ప్రభుత్వం కమిషన్ డబ్బులు అందించకుండా ఇబ్బందుల గురిచేస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నెలలో వ్యయ ప్రయాసలకు ఓర్చి వినియోగదారులకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే డీలర్లకు బకాయి పడ్డ కమిషన్ విడుదల చేసి తమ ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు గంగ నరసయ్య, శంకర్, రమేష్, నవీన్, గజానంద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.